సూపర్ ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని, దీనివల్ల రాబోయే ఆరు నెలల్లో సుమారు 4,51,000 అదనపు మరణాలు సంభవించవచ్చని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ అంచనా వేసింది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రభావం అధికంగా ఉండొచ్చని తెలిపింది. భారత్లో సుమారు 15,800 అదనపు ఉష్ణ మరణాలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. సాహెల్ ప్రాంతంలో 66,800, ఆగ్నేయాసియాలో 19,400, ఇండోనేషియాలో 19,300, బ్రెజిల్లో 13,300 మరణాలు సంభవించే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఎల్నినో నవంబర్-డిసెంబర్ నాటికి మరింత తీవ్రం కావచ్చని, ఫిబ్రవరి 2027 వరకు కొనసాగే అవకాశాలున్నాయని WMO తెలిపింది.