ముంబైలోని శాండ్‌హర్స్ట్ రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్‌పై నడుస్తున్న నలుగురు వ్యక్తులను రైలు ఢీకొట్టింది. గాయపడిన వారందరినీ రైల్వే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సెంట్రల్ రైల్వే సీపీఆర్‌వో స్వప్నిల్ ధన్‌రాజ్ నీలా ధృవీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Credits: ANI