రైలు పట్టాలు తప్పడంతో 44 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ఫ్రాన్స్లోని నార్మండీలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్యాసింజర్ రైైలు పట్టాలు తప్పింది. రూయెన్ నుంచి కేన్ ప్రాంతానికి వెళ్తుండగా క్లియోన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రికి తరలించారు.