అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఢిల్లీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. శివాజీ బ్రిడ్జి స్టేషన్ సమీపంలో హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ఘజియాబాద్ వెళ్తున్న 64419 రైలు పట్టాలు తప్పింది. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. వరుస ప్రమాదాలతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.