ఢీకొట్టిన రైలు.. ఇద్దరు మహిళలు నుజ్జు నుజ్జు (వీడియో)

బీహార్‌లోని బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఒకటో ప్లాట్‌ఫామ్ వద్ద ట్రాక్ దాటుతుండగా ఇద్దరు మహిళలను ఢిల్లీ నుండి మాల్దాకు వెళ్తున్న ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రైలు కింద పడి ఇద్దరు మహిళలు నుజ్జు నుజ్జు అయ్యారు. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వారి కళ్ల ముందే ఇలా జరగడంతో షాక్‌ అయ్యారు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ టీవీలో రికార్డైంది.

సంబంధిత పోస్ట్