TG: లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ బుధవారం ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు గురువారం, శుక్రవారం ఆయనను పోలీసులు విచారించనున్నారు. ఉదయ్ తనను లైంగికంగా వేధించి, దాడి చేశాడని తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఉదయ్‌ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.