ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

TG: మహబూబాబాద్ మండలం నడివాడకు చెందిన సుస్మిత (24) ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్లుగా ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. కులం కారణంగా యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించడం లేదంటూ అనిల్ వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చాడని ఆరోపించారు. తన ఆవేదనను 21 పేజీల లేఖలో రాసినట్లు తెలిపారు. పోలీసులు లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులు, బంధువులు మహబూబాబాద్ అండర్ బ్రిడ్జి వద్ద ధర్నాకు దిగారు.

సంబంధిత పోస్ట్

✕
✕