TG: రాష్ట్ర యువతకు విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జపాన్, జర్మనీలో కేర్‌టేకర్, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రణాళిక రూపొందించింది. నిథమ్ ఆధ్వర్యంలో ప్రతి బ్యాచ్‌లో 200 మందికి 3 నెలల పాటు భాషా శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగాలు కల్పించేలా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అభ్యర్థుల ఎంపిక కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.