కర్ణాటకలోని కలబురగి విమానాశ్రయం సమీపంలో సాంకేతిక లోపంతో శిక్షణా విమానం పంట పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి, విమానాన్ని సురక్షితంగా కిందకు దించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విమానంలో ఇన్స్ట్రక్టర్, ట్రైనీ పైలట్ సురక్షింగా బయటపడ్డారు. అధికారులు, కలబురగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.