శంషాబాద్‌ వచ్చిన ప్రయాణికుడికి ఎబోలా వైరస్‌ హిస్టరీ

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సూడాన్‌ నుంచి వచ్చిన ఒక విదేశీ ప్రయాణికుడికి ఎబోలా వైరస్‌ హిస్టరీ ఉన్నట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మహమ్మద్‌ అనే ఈ ప్రయాణికుడికి గతంలో ఎబోలా సోకినట్లు నిర్ధారణ కావడంతో, అతడిని గాంధీ ఆస్పత్రిలోని ఎబోలా వార్డుకు తరలించారు. నిర్ధారణ పరీక్షల కోసం సేకరించిన నమూనాలను సీసీఎంబీకి పంపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కానర్‌లో ఈ అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్