TG: ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్ఫీల్డ్ హైవే ఎగ్జిట్ సమీపంలో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోగా.. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.