పెర్త్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళ్తోంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో సులువు చేశాడు. కేవలం 69 బంతుల్లోనే శతకం సాధించిన హెడ్, 12 ఫోర్లు, 4 సిక్సర్లతో దూకుడుగా ఆడాడు. ఇది టెస్టుల్లో అతనికి పదో సెంచరీ. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్, రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియాకు లక్ష్యం సులభమైంది. ఇంగ్లండ్ బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయారు.