ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. యువకుడిపై కత్తితో దాడి

AP: విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన సూర్య, చైతన్య ఇద్దరు కాలేజీ స్నేహితులు. వీరిద్దరి మధ్య రెండున్నరేళ్లుగా ప్రేమ వ్యవహారం నడిచింది. 5 ఏళ్ల కిందట ఫ్రీ ఫైర్ గేమ్‌లో చెన్నై కడలూరుకి చెందిన కార్తికేయకు సూర్యతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దాంతో చైతన్యను దూరం పెట్టింది. అడ్డు తొలగించుకోవాలనుకున్న చైతన్య.. కార్తికేయను విశాఖకు రప్పించాడు. కార్తికేయపై చైతన్య కత్తితో దాడికి పాల్పడ్డారు. దాంతో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్