AP: శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఆర్జీయూకేటీ క్యాంపస్‌లో ట్రిపుల్ ఐటీ చదువుతున్న ప్రత్తిపాటి సృజన్ అనే విద్యార్ధి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్ధి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.