సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ 'జారా'పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన దుస్తులు వరుసగా మూడోసారి కూడా దుర్వాసనతో వచ్చాయని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. హోమ్ డెలివరీకి ముందు లేదా ప్యాకింగ్ చేసే సమయంలో దుస్తుల నాణ్యతను, పరిశుభ్రతను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. అంతర్జాతీయ బ్రాండ్ నుంచి ఇలాంటి సేవలు రావడం నిరాశ కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు. త్రిష పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.