చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ బోగీలో అనుమానాస్పదంగా కనిపించిన ట్రాలీ బ్యాగ్ కలకలం సృష్టించింది. బ్యాగ్ నుంచి దుర్వాసన, రక్తపు మరకలు రావడంతో పోలీసులకు సమాచారం అందింది. ఆగ్రా జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ పోలీసులు బ్యాగ్‌ను పరిశీలించగా, తల, కొన్ని శరీర భాగాలు లేని మృతదేహం లభ్యమైంది. చెన్నైకు సంబంధించిన స్లిప్ ఉండటంతో మృతదేహం చెన్నైకి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆగ్రా జీఆర్‌పీ కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది.