ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి బారాబంకీ వెళ్తున్న ఓ ట్రక్ శనివారం తెల్లవారుజామున సుశాంత్ గోల్ఫ్ సిటీలోని ఖుదాయ్ బజార్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్టీరింగ్ వద్ద డ్రైవర్ రోహిత్ ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక పరికరాలతో అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.