ఉత్తరప్రదేశ్ బదాయూన్ జిల్లాలోని ఏఆర్టీఓ కార్యాలయం సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బైకుపై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులను వేగంగా వచ్చిన ఒక ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మృతుడి భార్యను హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.