గుజరాత్లోని రాజ్కోట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న ఒక కారు, ఆటో రిక్షాలను వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలు ఇంకా అధికారికంగా గుర్తించాల్సి ఉంది. ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.