కర్ణాటకలోని మదికేరి-సోమవార్పేట్ స్టేట్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన ఓ పికప్ ట్రక్ అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది. దీంతో ట్రక్కులో ఉన్న వ్యక్తులు ఎగిరి పడ్డారు. అతి వేగంగా వచ్చి మలుపు వద్ద సడన్ టర్న్ తీసుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మలుపులు ఎక్కువగా ఉండే, కొండ ప్రాంతాల్లోని రోడ్లపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పరిమిత వేగంతో వెళ్లాలని చెబుతున్నారు.