కృత్రిమ మేధ రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్’ (SIF)ను ప్రకటించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జే క్లేటన్తో పాటు పలువురు ప్రముఖులకు ఈ ఫోర్స్ బాధ్యతలు అప్పగించినట్లు ట్రంప్ తెలిపారు. దేశాధ్యక్షుడు, చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కు ఇది నేరుగా నివేదిస్తుందని పేర్కొన్నారు. సూపర్ ఇంటెలిజెన్స్‌లో అమెరికాను అగ్రస్థానంలో నిలపడంతో పాటు వినియోగదారులు, మత సంస్థలు, కీలక మౌలిక వసతుల సంస్థలు, ఏఐ కంపెనీలతో ప్రభుత్వ సంప్రదింపులను సమన్వయం చేయడం దీని లక్ష్యమని వివరించారు.