పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలిసారి అధికారం చేపట్టడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చరిత్రాత్మక, నిర్ణయాత్మక విజయం సాధించారని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు మోదీకి ఆయన అభినందనలు తెలిపారని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి కుష్ దేశాయ్ తెలిపారు. 294 సీట్లున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 207 సీట్లను గెలుచుకుంది.