మలేసియాలో ఆసియాన్ సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యేక శైలి ప్రదర్శించాడు. కౌలాలంపూర్‌లో సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ట్రంప్‌ను మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సంప్రదాయ నృత్య కళాకారులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెడ్ కార్పెట్‌పై ట్రంప్ తనదైన స్టయిల్‌లో డ్యాన్స్ చేసి మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించారు.