గ్రీన్‌లాండ్‌ విషయంలో కచ్చితంగా చర్యలు: ట్రంప్‌

గ్రీన్‌లాండ్‌ విషయంలో కచ్చితంగా చర్యలు తీసుకుంటామని, అక్కడి ప్రజలకు నచ్చినా.. నచ్చకపోయినా ముందడుగు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. లేనిపక్షంలో ఆ ప్రాంతాన్ని రష్యా లేదా చైనా స్వాధీనం చేసుకుంటాయని ఆయన ఆరోపించారు. రష్యా, చైనాలను తమ పొరుగు దేశాలుగా ఉండటాన్ని కోరుకోవడం లేదని వైట్‌హౌస్‌లో మీడియా ముందు వ్యాఖ్యానించారు. తమ జాతీయ భద్రతకు గ్రీన్‌లాండ్‌ అవసరమని ట్రంప్‌ పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్