ఇరాన్‌తో ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అమెరికా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. శ్వేతసౌధంలోని సిట్యుయేషన్ రూమ్‌లో దాదాపు 2 గంటలపాటు చర్చించిన ట్రంప్.. ఈ డీల్‌పై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, ఒప్పందం చివరి దశకు చేరుకుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఇరాన్‌కు నిధుల విడుదల, అణుకార్యక్రమానికి సంబంధించిన వివాదాలు మాత్రం సమసిపోలేదని వారు తెలిపారు.