ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధి పేరును ‘ట్రంప్ జలసంధి’గా మారుస్తూ ఒక మ్యాప్‌ను విడుదల చేశారు. ఇరాన్ ప్రతిపాదించిన 7 రోజుల శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. హార్ముజ్‌పై అమెరికా సైన్యానికి 100% నియంత్రణ ఉందని, అందుకే పేరు మార్చారని ట్రంప్ పోస్టులను వెల్లడించే ‘X’ పేజ్ పేర్కొంది. ఈ జలసంధి ద్వారా క్రూడాయిల్ రవాణా జరుగుతోందని, ఇది 6 నెలల రికార్డును అధిగమించిందని కూడా తెలిపింది.