ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రానున్న రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతం పెరిగి 105 డాలర్లకు చేరింది. అలాగే WTI బ్యారెల్ చమురు ధర 3% ఎగబాకి 103 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది.