చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. మెనూలో ఎల్లో స్క్వాష్ వెలౌటే, అడవి పుట్టగొడుగులు, క్రిస్పీ పాన్‌సెట్టా, నువ్వులతో చేసిన సీ బాస్, బేబీ బోక్ చోయ్, రోస్టెడ్ ఎగ్‌ప్లాంట్ ఉన్నాయి. డెజర్ట్‌గా వనిల్లా క్రెమ్యూ, వాల్నట్ ఫ్రాంజిపేన్, వైట్‌హౌస్ తేనెతో తయారు చేసిన ఐస్‌క్రీమ్ వడ్డించారు. విందుకు ముందు ట్రంప్.. జిన్‌పింగ్‌ను మెరైన్ వన్ హెలికాప్టర్లో తీసుకెళ్లినట్లు, అనంతరం ఆయనకు ప్రత్యేక బహుమతి అందించినట్లు సమాచారం.