ట్రంప్‌నకు త్రుటిలో తప్పిన ప్రమాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’ హెలికాప్టర్ గగనతలంలో ఓ ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపానికి చేరుకోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. వాషింగ్టన్ సమీపంలో అమెరికా కాలమానం ప్రకారం ఆగస్టు నాలుగున జరిగిన ఈ ఘటనకు ఎయిర్ ట్రాఫిక్ కమ్యూనికేషన్ లోపాలే కారణమని ప్రాథమిక సమాచారం. పరిస్థితిని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వెంటనే పైలట్లను అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పింది. ఘటనపై అమెరికా FAA, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు ప్రారంభించగా, ట్రంప్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని వైట్‌హౌస్ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్