అమెరికాలో H-1B వీసాదారుల జీవిత భాగస్వాములకు (H4 వీసా) ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని తొలగించే దిశగా ట్రంప్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ప్రతిపాదించిన ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే, అమెరికాలో నివసిస్తున్న వేలాది భారతీయ కుటుంబాలపై, ముఖ్యంగా మహిళలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015లో ప్రవేశపెట్టిన H4 EAD నిబంధనను రద్దు చేయాలని ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ కోరుతోంది. ఈ ప్రతిపాదన చట్టంగా మారితే, గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ కుటుంబాల ఆదాయంపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది.