అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు 'పీస్' ప్రైజ్ వచ్చిందనే వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. గతంలో ఈ బహుమతి కోసం ఆశించిన ట్రంప్, పరాభవంతో అశాంతి, కోపం పెంచుకున్నారు. అయితే, ఈసారి 'పీస్' ప్రైజ్ రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. వైట్‌హౌజ్‌లో ప్రెస్ మీట్ పెట్టి పాట పాడారు. అసలు ట్రంప్‌కు 'పీస్' ప్రైజ్ ప్రకటించింది నోబెల్ కమిటీ కాదు, అర్జెంటీనాలోని 'హారిబుల్' కమిటీ. ఈ కమిటీ మూర్ఖత్వం, అహంకారానికి ప్రతి ఏటా 'పీస్' ప్రైజ్ ప్రకటిస్తుంది. 'పీస్' ఫుల్ ఫామ్ 'పెయిన్-మేకర్, ఎంప్టీ హెడ్, ఆరగెంట్, క్రేజీ, ఇగోయిస్టిక్' అని వివరించారు.