అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన వ్యాఖ్య చేశారు. కీలకమైన హర్మూజ్ జలసంధిని ‘అమెరికా కొత్త భూభాగం’గా చూపించే మ్యాప్‌ను తన ట్రూత్ సోషల్ ఖాతాలో మరోసారి పోస్ట్ చేశారు. గతంలోనూ హర్మూజ్‌ను అమెరికా భూభాగంగా చూస్తున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నౌకలు, ఓడరేవులపై అమెరికా నావికాదళం చర్యలు కొనసాగుతున్న సమయంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ప్రపంచ సముద్ర చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ జలమార్గం గుండా సాగుతుంది.