బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC)లో భారీ కలకలం రేగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేసి ప్రసారం చేసిన వివాదం నేపథ్యంలో సంస్థ డైరెక్టర్ జనరల్, న్యూస్ విభాగం సీఈవో రాజీనామా చేశారు. ట్రంప్ తన Truth Social ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఘటనపై స్పందిస్తూ, “బీబీసీ ఉద్యోగుల చర్య ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైనది, మీడియా నిష్పక్షపాతంగా ఉండాలి” అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం అంతర్జాతీయ మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.