ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌

ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ఇరాన్‌లో నిరసనకారులపై భద్రతా దళాల చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేవారిపై కాల్పులు జరిపితే జోక్యం చేసుకుంటామని, వారిని రక్షించుకుంటామని, ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ను హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందనగా, ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ లారిజాని, అమెరికా జోక్యం చేసుకుంటే ప్రాంతమంతా ఘర్షణలకు దారితీస్తుందని, జాతీయ భద్రతను పరీక్షించడం సాహసమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్