ప్రధాని మోదీని పొగుడుతున్న పోస్టును షేర్‌ చేసిన ట్రంప్‌

భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన ప్రధాని మోదీ ప్రశంసల పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో రీపోస్ట్ చేశారు. ఆదివారం రాత్రి గోర్ చేసిన పోస్టులో, ప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టమని, భారత్‌తో సంబంధాలు ఎప్పుడూ ఇంత దగ్గరగా లేవని, తాను మోదీకి పెద్ద అభిమానినని ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి చెప్పినట్లు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ట్రంప్ దీనిని రీపోస్ట్ చేస్తూ, ఢిల్లీలో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాల వీడియోను పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్