అమెరికా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ జోక్యంతో ఇండియా-పాక్ యుద్ధం ఆగిందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ఇండియా-పాక్, థాయ్‌లాండ్- కాంబోడియా, ఇజ్రాయెల్-ఇరాన్, రువాండా- కాంగో, ఈజిప్ట్-ఇథియోపియా దేశాల మధ్య ట్రంప్ కారణంగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందన్నారు. ఇన్ని యుద్ధాలు ఆపారు కావున డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.