మియామిలో జరిగిన కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, వాటి నుంచి సానుకూల ఫలితాలు వస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఇరాన్ హార్మూజ్ జలసంధిని 'ట్రంప్ జలసంధి'గా తెరవాలని ఆయన సూచించారు. అమెరికా సైన్యం యుద్ధంలో తన లక్ష్యాలను సాధిస్తోందని, 47 ఏళ్లుగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ బెదిరింపులకు పాల్పడుతోందని విమర్శించారు. ఇకపై అలాంటివి జరగవని, 'ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ'తో ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీశామని ఆయన ప్రకటించారు.