ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. కుదేలైన స్టాక్ మార్కెట్

దేశీయ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 535 పాయింట్లు నష్టపోయి 80,946 వద్ద, నిఫ్టీ 157 పాయింట్లు నష్టపోయి 24,696 వద్ద ట్రేడింగ్ స్టార్ట్ చేశాయి. నిఫ్టీలో బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, డాక్టర్ రెడ్డీస్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ ఆంక్షలతో పలు రంగాల షేర్లు భారీగా పతనమవడంతో 15 నిమిషాల్లో మదుపర్ల సంపద రూ.5 లక్షల కోట్లకు పైగా ఆవిరైంది.

సంబంధిత పోస్ట్