క్యూబాకు చమురు అమ్మితే టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు చమురు విక్రయించే లేదా సరఫరా చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ ఆంక్షలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు, విదేశాంగ విధానానికి ముప్పుగా మారిందని, రష్యా, చైనా, ఇరాన్ వంటి శత్రు దేశాలకు, హమాస్, హిజ్బుల్లా వంటి సమూహాలకు మద్దతు ఇస్తోందని ట్రంప్ ఆరోపించారు. అందువల్ల ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద క్యూబా విషయంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్