రూ.2,200 కోట్లు దాటిన TTD ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్‌ విరాళాలు

AP: ఎస్వీ అన్నప్రసాద ట్రస్ట్‌కు విరాళాలు రూ.2,200 కోట్లు దాటాయని TTD ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. ‘1985లో తిరుమలలో అన్నదాన పథకాన్ని నాటి సీఎం NTR ప్రారంభించారు. 2014లో శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్‌గా TTD పేరు మార్చింది. 2వేల మందితో ప్రారంభమై ప్రస్తుతం రోజుకు లక్ష మందికి అన్న వితరణ చేసే స్థాయికి ట్రస్ట్‌ డెవలప్ అయింది. ఈ ట్రస్ట్‌కు దాదాపు 9.7లక్షల మంది దాతలు ఉన్నారు’ అని బీఆర్‌ నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్