నేవీ అధికారి భార్యను రైలు నుంచి తోసేసిన టీటీఈ!

యూపీలో నేవీ అధికారి భార్య మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు రైల్వే టీటీఈపై కేసు నమోదైంది. నవంబర్ 26న వైద్యం కోసం ఢిల్లీకి బయలుదేరిన ఆర్తి(30) పొరపాటున మరో ట్రైన్ ఎక్కది. దీంతో టికెట్ విషయమై TTEతో ఆమెకు వివాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే లగేజితో పాటు ఆమెను TTE బయటకు తోసేశాడని తెలిపారు. దీంతో ఆర్తి అక్కడికక్కడే చనిపోయిందని వాపోయారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు GRP అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్