ముంబైలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ ట్యూషన్ క్లాస్‌లో బుధవారం రాత్రి జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చేతిరాత సరిగా లేదనే కోపంతో మహిళా టీచర్ 8 ఏళ్ల విద్యార్థి చేతులు కాల్చి శిక్ష విధించింది. క్యాండిల్ వెలిగించి దానిపై బాలుడి కుడిచేయి పెట్టించింది. గాయాలపాలైన బాలుడిని కుటుంబం ఆసుపత్రికి తరలించింది. తల్లి ఫిర్యాదుతో కురార్ పోలీసులు టీచర్ రాజశ్రీ రాథోడ్‌ను అరెస్ట్ చేశారు.