ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ జాతీయ ఆయుర్వేద సంస్థ ప్రకారం, తులసి చర్మ సౌందర్యాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. తులసి నీరు తాగడం వల్ల రక్తం శుద్ధి అయి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తులసి ఫేస్ ప్యాక్, తులసి టీ, పచ్చి తులసి ఆకులు నమలడం వంటివి చర్మ ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అయితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలుంటే ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి.