తులసి ఆకులు వ్యాధి నిరోధక శక్తిని వద్ధి చేయడంతో పాటు శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఓ ఐదారు తులసి ఆకుల కషాయాన్ని మరగించి టీ మాదిరి చేసుకుని తాగితే, దగ్గు, జలుబు, ఆస్తమా అదుపులోకి వస్తాయి. ఇక అల్లం.. జీర్ణశక్తిని పెంచడంతో పాటు కడుపులోని వికారాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, ఆకలి పెరుగుతుంది. అలాగే కీళ్ళ నొప్పులు, గ్యాస్ సంబంధిత సమస్యలు దూరం అవుతాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.