కోల్‌కతాలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్

ఖాట్మండు నుండి ఇస్తాంబుల్‌కు వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం THY-727లో, బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజిన్ వైఫల్యం కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో కోల్‌కతాకు మళ్లించబడింది. నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన విమానంలో 236 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. పైలట్ల అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఒకే ఇంజిన్‌తో అంతర్జాతీయ విమానాన్ని కొనసాగించడం సురక్షితం కాదని భావించిన సిబ్బంది, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ విమానాన్ని కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం 3:03 గంటలకు ల్యాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్