TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని ఓ పబ్‌లో బుల్లితెర నటి వేధింపులకు గురైనట్లు ఆమ తెలిపారు. తన అన్న, బావతో కలిసి పబ్‌కు వెళ్లిన ఆమె పట్ల ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తించారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై యువకులు దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇటీవల కాలంలో పబ్‌లలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని, బాధితులు ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడుతున్నారని వార్తలు వస్తున్నాయి.