టీవీకే చీఫ్ విజయ్ తన ఆస్తుల విలువ రూ. 520 కోట్లు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య సంగీత పేరు మీద ఇండియన్ బ్యాంక్ లో రూ.25 కోట్లు, యాక్సెస్ బ్యాంక్ లో రూ.40 కోట్లు, HDFC బ్యాంక్ లో రూ.20 కోట్లు ఉన్నట్లు విజయ్ అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.