తమిళనాడు రాజకీయాల్లో నూతన శకం ప్రారంభమైంది. ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ శాసనసభ ఎన్నికల్లో 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. సినిమా గ్లామర్‌ను ప్రజాబలంగా మార్చుకున్న విజయ్, విజయం తర్వాత వినయం, పరిణతి ప్రదర్శిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలకు స్పందిస్తూ.. 'మా ప్రజల సంక్షేమమే ఏకైక లక్ష్యం. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం.' అని విజయ్ పేర్కొన్నారు.