వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని 'టీవీకే' మంగళవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడ, విజిల్, ఆటో, క్రికెట్ బ్యాట్ వంటి 10 గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాల్సిందిగా ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది. టీవీకే సంయుక్త ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్, సీనియర్ నాయకుడు అర్జున మూర్తి తదితరులు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను కలిసి ఈ దరఖాస్తును అందించారు.