వికారాబాద్‌లో జంట మృతదేహాల కలకలం

TG: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం ఐనెల్లి శివారులో కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు లభించడం కలకలం రేపింది. తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. మృతుల్లో ఒకరు పురుషుడు, మరొకరు మహిళ. మృతదేహాల వద్ద గుర్తింపు కార్డులు లభించలేదు. పురుగుల మందు డబ్బాలు లభించడంతో ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే దానిపై పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

సంబంధిత పోస్ట్

✕
✕